Thursday, 26 November 2015

Size Zero Movie Review Review


బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై పరమ్‌ వి.పొట్లూరి నిర్మించారు. ఈ సినిమా కోసం ఏ స్టార్ హీరోయిన్ చేయని రిస్క్ అనుష్క చేసింది. ఈ సినిమాలోని పాత్రకోసం తన బరువును భారీగా పెంచేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ట్రైలర్లు, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది.

Keep visiting Cinewishesh.com for Size Zero Movie Review.

Friday, 13 November 2015

Mega Star Ram Charan Meets Facebook Employees


ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దాదాపు 90% మంది జనాలు ఫేస్ బుక్ లో తెగ సందడి చేసేస్తుంటారు. కానీ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఏకంగా ఫేస్ బుక్ ఆఫీస్ లోనే సందడి చేసేసాడు. తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో వెకేషన్స్ కు వెళ్లాడు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ హెడ్ ఆఫీస్ లో సందడి చేసారు.

అక్కడి ఉద్యోగులతో చరణ్ కాసేపు సరదాగా గడిపి, ముచ్చటించారు. వారితో కలిసి చరణ్ కొన్ని ఫోటోలను తీసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తనకు కానుకలు ఇచ్చిన వారికి చరణ్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. వారు కూడా చరణ్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

‘బ్రూస్ లీ’ తర్వాత చరణ్ ‘థని ఒరువన్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ రీమేక్ కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70151-ram-charan-meets-facebook-employees.html

Tuesday, 10 November 2015

Sharwanand Express Raja Movie Teaser


‘రన్ రాజా రన్’ వంటి హిట్ చిత్రం తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇందులో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌,సుర‌భి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ఉర్వ‌శి, ప్ర‌భాస్ శీను, సుప్రీత్‌, స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, దువ్వాసి, బండ ర‌ఘు, నాగినీడు, సుర్య త‌దిత‌రులు న‌టించారు..
సాంకేతికనిపుణులు.. కెమెరా-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని, సంగీతం-ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌- ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌- స‌త్య‌.జి, డాన్స్‌- రాజుసుంద‌రం, రఘు, స్టంట్స్‌-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్‌-తోట భాస్క‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మెద్‌, ద‌ర్శ‌క‌త్వం- మేర్ల‌పాక గాంధి

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70037-sharwanand-express-raja-movie-teaser.html

Balakrishna Dictator Film Release On Pongal 2016


నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘’సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లోనూ విడుదల చేయాలని మా సంకల్పానికి బాలయ్యగారు పూర్తి సహాయ సహాకారాలందిచారు. ప్రతి క్షణం ఆయన అందించిన మద్దతుతోనే సినిమా షూటింగ్ చాలా కూల్ గా ఎటువంటి ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతుంది. అలాగే సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రెండు పాటలు, రెండు ఫైట్స్, డిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబ‌ర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

సుమన్, పవిత్రా లోకేష్, నాజర్, వెన్నెలకిషోర్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రంజీత్, అజయ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోనవెంకట్-గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ఇంటర్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70058-balakrishna-dictator-film-release-on-pongal-2016.html



Monday, 9 November 2015

సారీ చెప్పి బతికి బయటపడ్డ ఆలీ


తెలుగు సినీ నటుడు, కమెడీయన్ ఆలీపై మహిళా సంఘాలు గోల గోల చేస్తున్నాయి. ఆలీ గతకొద్ది కాలంగా ఆడవాళ్లను చులకనగా చూస్తూ, వారిపై చెత్త చెత్త కామెంట్లు చేస్తున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఆలీ తన నోటి దురుసును ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు.

ఇటీవలే ‘సైజ్ జీరో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో అనుష్క తొడలపై ఆలీ చెత్తగా కామెంట్లు చేయడంతో మళ్లీ ఆలీ హాట్ టాపిక్ గా మారిపోయాడు. గతంలో ఎవరో ఒకరో, ఇద్దరో ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎవరేమి పట్టించుకోలేదు. కానీ ఇపుడు మహిళా సంఘాలు ఏకమై ఆలీకి బుద్ధిచెప్పాలని ప్రయత్నంలో వున్నట్లుగా తెలిసింది.

ఇటీవలే ఆలీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ హోటల్లో దిగాడని తెలుసుకున్న మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అక్కడికి వెళ్లి ధర్నా చేసారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం, ద్వందార్థాలతో అగౌరవపరుస్తున్నాడంటూ వారు ఆరోపిస్తూ, ఆలీకి వ్యతిరేకంగా నిరసనలు చేసారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరి, ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోగా ఆలీ తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా ప్రకటించడంతో వారు శాంతించారు. మరి ఆలీ ఇదే విధంగా అసభ్యకరంగా మాట్లాడితే మహిళా సంఘాలు మరింత తీవ్రంగా స్పందించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తున్నాయి.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70026-ali-responds-to-his-comments-on-anushka-thighs.html

విడుదలకు ముందే సినిమా రిలీజ్.. టాక్ అదుర్స్


అక్కినేని అభిమానులకు దీపావళికి ముందే ఓ పండగ లాంటి వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా ఈనెల 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా వారం రోజుల ముందే విడుదలయినట్లుగా సమాచారం.

దీపావళి రోజున నవంబర్ 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ రోజున అమావాస్య కావడంతో ‘అఖిల్’ సినిమాను గత శుక్రవారం(నవంబర్6) రోజునే అక్కినేని కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అంతా కలిసి ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి మరీ ‘అఖిల్’ సినిమా వీక్షించారట. సినిమా సూపర్బ్ అంటూ చూసిన వాళ్లంతా చెబుతున్నారట.

కానీ చూసిన వారంతా కూడా అక్కినేని కుటుంబ సభ్యులు, ఆత్మీయులే కాబట్టి వారి టాక్ ను నమ్మలేం. కానీ తాజా సమాచారం ప్రకారం ‘అఖిల్’ సినిమా పైసా వసూల్ సినిమాని తెలిసింది. అఖిల్ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అదరగొట్టేసాడని సమాచారం. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం టాక్ పూర్తిగా పాజిటివ్ గా వుండటంతో అభిమానులు సంతోషంగా వున్నారు.

సినిమా విడుదలై మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ సంగీతం అందించాడు.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70027-akhil-movie-pre-release-talk-hit.html