‘రన్ రాజా రన్’ వంటి హిట్ చిత్రం తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
ఇందులో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నటీనటులు.. శర్వానంద్,సురభి, హరీష్ ఉత్తమన్, ఉర్వశి, ప్రభాస్ శీను, సుప్రీత్, సప్తగిరి, షకలక శంకర్, దువ్వాసి, బండ రఘు, నాగినీడు, సుర్య తదితరులు నటించారు..
సాంకేతికనిపుణులు.. కెమెరా-కార్తిక్ ఘట్టమనేని, సంగీతం-ప్రవీణ్ లక్కరాజు, ఆర్ట్- రవీందర్, ఎడిటర్- సత్య.జి, డాన్స్- రాజుసుందరం, రఘు, స్టంట్స్-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్-తోట భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- ఎన్.సందీప్, నిర్మాతలు- వంశి, ప్రమెద్, దర్శకత్వం- మేర్లపాక గాంధి
Source:
http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70037-sharwanand-express-raja-movie-teaser.html